Skip to main content

Namaste NRI

 పశ్చిమ దేశాలకు రష్యా వార్నింగ్‌ .. అలా చేస్తే మేం ఆపేస్తాం

పశ్చిమ దేశాలకు రష్యా వార్నింగ్‌ ఇచ్చింది. ఒకవేళ తన ఇంధన సరఫరాపై నిషేధం విధిస్తే అప్పుడు యూరోప్‌కు గ్యాస్‌ సరఫరాను నిలిపేస్తామని రష్యా పేర్కొన్నది.  డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్‌ నోవాక్‌ ఓ ప్రకటన చేశారు. రష్యా అయిల్‌పై ఆంక్షలు విధిస్తే అది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందన్నారు. ఆంక్షల వల్ల బ్యారెల్‌ ఇంధన ధర 300 డాలర్లకు చేరుతుందని ఆయన హెచ్చరించారు. యూరప్‌లో వివిధ దేశాలకు 40 శాతం గ్యాస్‌, 30 శాతం ఇంధనం రష్యా నుంచే అందుతుంది. ఒకవేళ ఆ సరఫరా ఆగిపోతే అప్పుడు ఆ దేశాల పరిస్థితి ఆయోమయంగా ఉంటుంది. ఫస్ట్‌ నార్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌లైన్‌ ద్వారా జర్మనీకి రష్యా నుంచి గ్యాస్‌ సరఫరా అవుతోంది.

Social Share Spread Message

Latest News