Skip to main content

Namaste NRI

మెగాస్టార్‌ సరసన శ్రుతిహాసన్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రంలో శ్రుతి హాసన్‌ నాయికగా ఎంపికయ్యారు. కె.ఎస్‌.రవీంద్రనాథ్‌ (బాబీ) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రం. పోర్ట్‌ ఏరియా నేపథ్యంతో తెరకెక్కనుంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. శృతిహాసన్‌కు ఫ్లవర్‌ బొకే అందిస్తున్న చిరంజీవి ఆ ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మా చిత్రబృందంలోకి నిన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది. సినిమాకు నువు మహిళాశక్తిని తీసుకొస్తావని ఆశిస్తున్నాం అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News