Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన ప్రకటన

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. నాటో కూటమిలో తాము చేరాలనుకోవడం లేదని ప్రకటించారు. తమపై దాడులకు తెగపబడుతున్న రష్యాపై ఆ కూటమి పోరాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ భూభాగంలోని  ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన రష్యా నిర్ణయంపై కూడా రాజీపడనున్నట్టు ప్రకటించారు.  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడానికి ప్రధాన కారణాలు ఇవే కావడం గమనార్హం. యుద్ధం నేపథ్యంలో తాను పోలండ్‌కు పారిపోయాన్న వార్తలనూ జెలెన్‌స్కీ తోసిపుచ్చారు. కీవ్‌లోని తన అధికారిక కార్యాలయంలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో లొకేషన్‌ షేర్‌ చేశారు. ..

Social Share Spread Message

Latest News