Skip to main content

Namaste NRI

ఆర్‌ఆర్‌ఆర్‌ ఎత్తర జెండా సాంగ్‌ విడుదల

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఆర్‌ఆర్‌ఆర్‌ సెలబ్రేషన్‌ యాంథమ్‌ అంటూ ఎత్తర జెండా వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడి గిత్తల్లాంటి అమర వీరుల్ని తలచుకుంటూ అంటూ జక్కన్న చెప్పే డైగాగ్‌తో ప్రారంభం అవుతుంది.  ఈ సినిమాకు యం.యం. కీరవాణి స్వరకర్త. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను యం.యం.కీరవాణి, విశాల్‌ మిక్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి హారికా నారాయణ్‌ ఆలిపించారు. స్వాతంత్య్ర సమరయోధులు కనిపిస్తుండగా వీడియోలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అలియాభట్‌ కలిసి సందడి చేసిన తీరు ప్రధాన ఆకర్షణగా నిలించింది,

Social Share Spread Message

Latest News