ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ కీలక ప్రకటన చేశారు. నాటోలో తాము చేరదల్చుకోలేమని ప్రకటించారు. ఉక్రెయిన్‌పై 20 రోజులుగా రష్యా బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. తమ లక్ష్యం పూర్తయ్యే వరకు ఇలా కొనసాగుతూనే వుంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ వాస్తవాన్ని ప్రజలందరూ అంగీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత జరిగిన మొదటి రౌండు చర్చల్లోనూ ఉక్రెయిన్ ఇదే ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధం 20వ రోజుకు చేరిన నేపథ్యంలో జెలెన్‌స్కీ మళ్లీ ఇదే ప్రకటన చేశారు














