Skip to main content

Namaste NRI

పుతిన్‌ సంచలన నిర్ణయం…వారికి రష్యాలోకి నో ఎంట్రీ

అమెరికా అధ్యక్షుడు బో బైడెన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆంక్షలు విధించారు. ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాపై అమెరికా పలు కఠిన ఆంక్షలు విధిస్తూ పుతిన్‌పై రోజూ ఏదో రకంగా దాడి చేస్తూనే ఉంది. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అమెరికాకు రివర్స్‌ రaలక్‌ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, హిల్లరీ క్లింటన్‌తో సహా పలువురు ఉన్నతాధికారులపై ఆంక్షలు విధిస్తూ పుతిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, హిల్లరీ క్లింటన్‌తో సహా మరో 12 మంది రష్యాలోకి ప్రవేశించడానికి వీల్లేదని పుతిన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని రష్యా విధేశాంగ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ యుద్ధంలో ఇప్పటివరకూ వందలాది మంది మరణించారు. రెండు కోట్ల మందికి పైగా పౌరులు పొరుగుదేశాలకు వలసపోయారు.

Social Share Spread Message

Latest News