విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. రుక్సర్ థిల్లాన్ నాయికగా నటిస్తున్నది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ మా అర్జున్ కుమార్ కళ్యాణానికి ముహూర్తం నిర్ణయించాం. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తున్నది. 30 ఏళ్ల వయసొచ్చినా హీరో అర్జున్ కుమార్‌కు ఎందుకు పెళ్లి కాలేదు, అతని పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఏం చేశారన్నది సినిమాలో వినోదాత్మకంగా చూపిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : జై క్రిష్. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి కిరణ్ కథ కథనం అందించగా విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. రవికిరణ్ కోలా: కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి విప్లవ్ ఎడిటర్, ప్రవల్య దుద్దిపూడి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడిరచారు.














