Namaste NRI

భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మొదటి నుంచి భారతీయ అమెరికన్లకు తగిన ప్రాధాన్యమిస్తూ పలు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిని కీలక పదవులకు ఎంపిక చేసినా అధ్యక్షుడు తాజాగా మరో భారత సంతతి మహిళను రాయబారిగా నామినేట్‌ చేశారు. మాలి దేశానికి అమెరికా రాయబారిగా ఇండో అమెరికన్‌ మహిళ రచనా సచ్‌దేవ్‌ను నియమించారు. ఈ మేరకు వైట్‌హౌజ్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడిరది.  భారత సంతతి చెందిన రచనా సచ్‌దేవ్‌ అమెరికా ఫారిన్‌ సర్వీసెస్‌లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నారు. గతంలో ఆమె శ్రీలంక, సౌదీ అరేబియాలలో పని చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈస్ట్రర్స్‌ ఎఫైర్స్‌ విభాగంలో పని చేశారు. తాజాగా మాలి దేశానికి రాయబారిగా నియమించారు.

                కొలంబోలోని అమెరికన్‌ ఎంబసీలో నిర్వహణ విభాగం హెడ్‌గా పని చేశారు.  యూఎస్‌ ఫారిన్‌ సర్వీస్‌లో కెరీర్‌ సభ్యురాలైన ఆమె ప్రస్తుతం బ్యూరో ఆఫ్‌ సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ ఆసియన్‌ అఫైర్స్‌ సంయుక్త కార్యనిర్వాహక కార్యాలయాలకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. న్యూజెర్సీలోని ఫ్లెమింగ్టన్‌కు చెందిన రచనా తన అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీని కంప్యూటర్‌  సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌లో  పూర్తి చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events