సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్‌పుల్ డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ సరసన సమంత నాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. స్క్రీప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై.రవిశంకర్, నవీన్ యెర్నేని, దర్శకుడు శివకు అందజేశారు. ప్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. చక్కటి కుటుంబ కథా చిత్రంలో విజయ్ నటిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్‌లో ప్రారంభం అవుతుందని మేకర్స్ తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్, వైజాగ్ అల్లెప్పిల్లో మిగతా షూటింగ్ జరుపుకుంటుందన్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమలో అలీ, వెన్నె కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, జి.మురళి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.














