Skip to main content

Namaste NRI

యశోదకు ఏం జరిగింది?

యశోద కళ్లు తెరిచి చూసే సరికి తానో కొత్త ప్రపంచంలోనే ఉన్నాననే నిర్ధారణకు వచ్చింది. చుట్టు పరిసరాలు, తను వేసుకున్న దుస్తులు, తన చేతికి ఉన్న వాచ్‌తో పాటు అక్కడున్న నిశబ్దం కూడా యశోద కు చాలా కొత్తగా, వింత వింతగా అనిపిస్తున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినబడుతుండగా నెమ్మదిగా వెళ్లి అక్కడున్న కిటికీ తెరిచి చూసింది. తన స్వేచ్ఛగా అక్కడ వాలినట్టుగా ఉన్న తెల్లటి పావురాన్ని ఆత్రంగా అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ అక్కడేం జరిగింది? ఇదంతా యశోద్‌ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌లో కనిపిస్తుంది. గురువారం వీటిని విడుదల చేశారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమాకు హరి, హరీష్‌ జంటగా దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. దాన్ని  దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీస్తున్నాం. యశోదగా సమంత అంకితభావం చూస్తుంటే గర్వంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్‌ చేస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళిశర్మ, సంపత్‌ రాజ్‌ కీలక పాత్రధారులు. ఆగస్ట్‌ 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News