Namaste NRI

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం… వారికి శాశ్వత నివాస అర్హత

కార్మికుల కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం అదనంగా 35 వేల మంది విదేశీయులకు దేశంలో శాశ్వత నివాస అర్హత కల్పించేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు ఏటా 1.60 లక్షల మంది విదేశీయులు ఆస్ట్రేలియాలో సెటిలయ్యే వారు. ప్రభుత్వం ఈ పరిమితిని తాత్కాలిక ప్రాతిపదికన 1.95 లక్షలకు పెంచేందుకు సిద్ధమవుతోంది. నిపుణులైన ఉద్యోగులు అందుబాటులో లేక ఇక్కట్ల పాలవుతున్న ఆస్ట్రేలియా వ్యాపార సంస్థలకు ఈ నిర్ణయంతో ఊరట లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిపుణుల కొరతకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events