Skip to main content

Namaste NRI

బ్రిటన్‌ నూతన రాజుగా చార్లెస్‌-3

బ్రిటన్‌ నూతన రాజుగా చార్లెస్‌-3 నియమితులయ్యారు. లండన్‌లోని సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌లో యాక్సెషన్‌ కౌన్సిల్‌ సమక్షంలో ఆయనకు 73 ఏండ్ల వయసులో రాజరికపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా లండన్‌లోని హైడీ పార్కులో ట్రూప్‌ రాయల్‌ హార్స్‌ ఆర్టిల్లరీ 41 గన్‌లతో వందనం చేశాయి. అనంతరం ఆయన ప్రసంగించారు. తన తల్లి జీవితకాలం ప్రేమను అందించి నిస్వార్థంగా నిలిచారన్నారు. అధికారాల అప్పగింత కార్యక్రమం బ్రిటన్‌ చరిత్రలోనే తొలిసారిగా టీవీల్లో ప్రసారమైంది.

Social Share Spread Message

Latest News