బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్-3 నియమితులయ్యారు. లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో యాక్సెషన్ కౌన్సిల్ సమక్షంలో ఆయనకు 73 ఏండ్ల వయసులో రాజరికపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా లండన్‌లోని హైడీ పార్కులో ట్రూప్ రాయల్ హార్స్ ఆర్టిల్లరీ 41 గన్‌లతో వందనం చేశాయి. అనంతరం ఆయన ప్రసంగించారు. తన తల్లి జీవితకాలం ప్రేమను అందించి నిస్వార్థంగా నిలిచారన్నారు. అధికారాల అప్పగింత కార్యక్రమం బ్రిటన్ చరిత్రలోనే తొలిసారిగా టీవీల్లో ప్రసారమైంది.














