విన్ను మద్దిపాటి, స్మిరిత రాణిబోర, కాలకేయ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న చిత్రం గ్రంథాలయం. సాయిశివన్ జంపాన దర్శకుడు. ఎస్.వైష్ణవి నిర్మాత. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ నాకొచ్చిన ఓ కల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. ఆద్యంతం సస్పెన్స్‌తో థ్రిల్‌ను పంచుతుంది అన్నారు. గ్రంధాలయం ప్రమోషన్ లో భాగంగా రెండు తెలుగు రాష్టాలలో ఒక క్యాంపైన్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంధాలయం టీం ఇచ్చిన క్లూ ను గెస్ చేసిన వారిలో కొందరిని సెలెక్ట్ చేసి వారిలోని 10 మందికి సిల్వర్ కీ చైన్, విన్నర్ అయిన వారికి 1 గోల్డ్ కీ చైన్ ఇవ్వడం జరుగుతుంది. ఆలా విన్ అయిన గణేష్ అనే వ్యక్తి కి లక్ష రూపాయల గోల్డ్ కీ చైన్ ఇస్తామని చిత్ర నిర్మాత అనౌన్స్ చేయడం జరిగింది.విన్నర్ అయిన గణేష్ మాట్లాడుతూ ఈ క్యాంపెయిన్ పార్టీసీపేట్ చేసి గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మార్చి 3 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి వినూత్నమైక కథ ఇదని నాయకానాయికలు తెలిపారు.
తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని నిర్మాత తెలిపారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్, సంగీతం: వర్ధన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: చిన్నా, నిర్మాణ సంస్థ: వైష్ణవి క్రియేషన్స్, రచన-దర్శకత్వం: సాయిశివన్.














