Namaste NRI

ఐర్లాండ్ లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నగరంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 73 వ జన్మదిన వేడుకలను ఎన్నారై టీడీపీ ఐర్లాండ్  సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు  మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకతని తెలియజేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అధిరోహించిన ప్రగతి శిఖరాల ను, నేడు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బేరీజు వేస్తూ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. సైకో పాలనకు స్వస్తి పలికి సైకిల్ పాలనకు నాంది పలకాలనీ పిలుపునిచ్చారు.

ఈ సంధర్బంగా టీడీపీ ఐర్లాండ్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సీత  కేకే కట్ చేసి సభ్యులకు పంచారు. ఈ వేడుకల్లో రీజియనల్ కోఆర్డినేటర్ డా.కిషోర్ బాబు చలసాని, ప్రెసిడెంట్ భాష్యం భరత్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రంగ గల్లా, యశ్వంత్ మడకశిర, కాట్రగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, నరేంద్ర, శివబాబు, రామకృష్ణ , విజయ్, రాంబాబు పరిస , అరుణ్ అంధవరపు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News