అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అతను ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనమే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి ట్రంప్ ఈ సారి తన ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. చేతిలో పెద్ద పిజ్జా ను పెట్టుకుని, అందులోని ఓ ఎంగిలి పిజ్జా ముక్కను ఆఫర్ చేశారు. ఫ్లోరిడా లోని ఫోర్ట్ మయర్స్‌లో రిపబ్లికన్ పార్టీ ప్రసంగం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రంప్ ఫోర్ట్ మయర్స్‌లోని లీ కౌంట్రీ అనే ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ తరఫున జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రసంగం అనంతరం డౌన్‌టౌన్ హౌస్ ఆఫ్ పిజ్జా అనే దుకాణం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ పిజ్జా ఆర్డర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ట్రంప్‌ను చుట్టుముట్టారు. ఆ సమయంలో ట్రంప్ ఓ పెద్ద పిజ్జాను చేత్తో పట్టుకుని అందులోని ఓ ముక్కని అభిమానుల వైపు చూపిస్తూ నేను తిన్న ఈ ముక్క ఎవరికైనా కావాలా ? అంటూ ఆఫర్ చేశారు. అనంతరం ఆ ముక్కను కొరికి తిన్నారు. దీంతో ట్రంప్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

















