Namaste NRI

భారత్‌ అరుదైన ఘనత .. ప్రపంచంలోనే

ప్రపంచ అత్యుత్తమ టాప్ 10 పాఠశాలల జాబితాలో మన దేశానికి చెందిన ఐదు పాఠశాలలు స్థానం సంపాదించుకుని తమ సత్తా చాటుకున్నాయి. బ్రిటన్‌కు చెందిన వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజెస్ ఈ ద్వివార్షిక పోటీని నిర్వహించింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన ఈ ఐదు పాఠశాలలు వివిధ కేటగిరీల కింద స్ఫూర్తిదాయకమైనవిగా పరిగణించారు. ఢిల్లీకి చెందిన నగర్ నిగం ప్రతిభా బాలిక విద్యాలయ , ముంబైకి చెందిన ఒబెరాయ్ ఇంటర్నేషనల్ స్కూల్, షిండేవాడి ముంబై పబ్లిక్ స్కూల్, గుజరాత్ లోని అహ్మదాబాద్‌కు చెందిన రివెర్‌సైడ్ స్కూల్, మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్‌కు చెందిన స్నేహాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎంపికయ్యాయి. సామాజిక సహకారం లోను, , పర్యావరణ కార్యాచరణ, నూతన ఆవిష్కరణ, ప్రతికూతలను అధిగమించడం, ఆరోగ్యకరజీవిత సహకారం తదితర ఐదు కేటగిరీల కింద ఈ పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ కేటగిరీలకు సంబంధించిన 2,50,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2 కోట్లు )నగదు బహుమతిని ఈ పాఠశాలలకు సమానంగా పంచుతారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events