Skip to main content

Namaste NRI

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో భారత సంతతి వ్యక్తి

వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ అధ్యక్ష ఎన్నికల బరిలోకి మరో భారత సంతతి వ్యక్తి చేరారు. వ్యాపారవేత్త శివ అయ్యాదురై(59) తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.  ముంబైలో జన్మించిన ఆయన, 1970లో తన తల్లిదండ్రులతో సహా అమెరికాకు వలస వెళ్లి పాటెర్‌సన్‌లో స్థిరపడ్డారు. దేశంలో రెండు పక్షాల రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు ఆయన తన ప్రచార వెబ్‌సైట్‌లో తెలిపారు.  మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి అయ్యదురై నాలుగు డిగ్రీలు పొందారు. ప్రస్తుతం వ్యాపార వేత్తగా, ఓ టెక్‌ కంపెనీకి ఫౌండర్‌గా, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News