Skip to main content

Namaste NRI

ప్రవాసులు జర జాగ్రత్త.. ఇకపై అలా చేశారో

యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌ లోని ప్రవాసులు ఎవరైతే వీసాల గడువు ముగిసినా, ఇంకా దేశంలోనే ఉంటారో వారికి ఇకపై డైలీ జరిమానా ఉంటుంది. అలా గడువు ముగిసిన రెసిడెన్సీ, విజిట్ వీసాలపై ఉండేవారికి రోజుకు 50 దిర్హమ్స్ (రూ.1,128) ఫైన్ ఉంటుందని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ నేషనాలిటీ, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ వెల్లడించింది. గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత ప్రతి రోజూ యాభై దిర్హమ్స్ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.   ఎంట్రీ పర్మిట్‌తో సహా వీసా సర్వీస్‌ను సైతం అధికారిక వెబ్‌సైట్ దుబాయ్ నౌ , స్మార్ట్ యాప్, టైపింగ్ సెంటర్ ద్వారా పొందవచ్చని తెలిపారు. వీసా దరఖాస్తు కోసం ఎలక్ట్రానిక్ ఛానెల్‌లు ఉన్నాయని, వాటి ద్వారా ఎంట్రీ పర్మిట్, రెసిడెన్సీ అనుమతి కోసం అభ్యర్థనను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఆ అప్లికేషన్లు గూగుల్ , యాపిల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.

Social Share Spread Message

Latest News