Skip to main content

Namaste NRI

సిద్ధు జొన్నలగడ్డ కొత్త మూవీ లాంఛ్‌ 

సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం హైదారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సంస్థకిది 37వ సినిమా. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, దిల్‌ రాజు కెమెరా స్విఛాన్‌ చేశారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే అన్ని అంశాలుంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాం అన్నారు. ఈ కార్యక్రమానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్ల, సమర్పణ: బాపినీడు.బి, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్‌.

Social Share Spread Message

Latest News