Namaste NRI

కొత్త కథలకే ప్రాధాన్యత .. గాండీవధారి అర్జున ప్రీరిలీజ్‌లో వరుణ్‌తేజ్‌

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం గాండీవధారి అర్జున. ఈ చిత్రం   ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త కథలకే నేను ప్రాధాన్యతనిస్తాను. సామాజిక సందేశం ఉన్న కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో అంతర్లీనంగా చర్చించిన ఓ పాయింట్‌ బాగా నచ్చింది అన్నారు.   కేవలం మన కుటుంబం గురించే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలని తెలియజెప్పే చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా చూశాను. మంచి సినిమా చూశాననే భావన కలిగింది అన్నారు.

దర్శకుడు  మాట్లాడుతూ గ్లోబల్‌ ఇష్యూ మీద ఈ సినిమా తీశాం. ఎన్ని జోనర్స్‌లో సినిమాలు చేసినా.యాక్షన్‌ మూవీస్‌ తీసినప్పుడు వచ్చే కిక్కే వేరు. కేవలం 54 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. వరుణ్‌తేజ్‌ ఈ సినిమా కోసం అంకితభావంతో శ్రమించాడు అని తెలిపారు. వరుణ్‌తేజ్‌తో తాము తీసిన తొలిప్రేమ హిట్‌ అయ్యిందని, ఈ సినిమాకు కూడా అదే సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందని నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, అనిల్‌ రావిపూడి, శ్రీకాంత్‌ అడ్డాల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events