Namaste NRI

మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ట్రైలర్‌ విడుదల

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి. మహేష్‌ బాబు.పి. దర్శకత్వం.  యువీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా  హీరో నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ జాతిరత్నాలు హిట్‌ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేయాలని ఒత్తిడికి గురయ్యాను. చాలా కథలు విన్నాను. ఆ క్రమంలోనే దర్శకుడు మహేష్‌ ఈ కథ చెప్పాడు. వినగానే ఎంతో నచ్చింది. ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుందనే ధైర్యం కలిగింది. స్టాండప్‌ కామెడీతో పాత్రతో ఇలాంటి ఫుల్‌లెంగ్త్‌ సినిమా తెలుగులో ఇప్పటి వరకు రాలేదు. ఈ చిత్రంలో వుండే యూనిక్‌ పాయింట్‌ అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని చేశాం. రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో మేము కొంత ఎంటర్‌టైన్‌ చేయగలిగాం. రేపు థియేటర్‌లో పూర్తి సినిమా చూస్తున్నప్పుడు కంప్లీట్‌గా ఎంజాయ్‌ చేస్తారు. ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా వుంటుంది.పెళ్లితో పాటు వాళ్లు ఏర్పర్చుకునే ప్రతి రిలేషన్‌లో యువత ఆలోచించే తీరు ఎలా వుంటుంది అనేది చూపిస్తున్నాం. యూనిక్‌ పాయింట్‌తో రూపొందుతున్న చిత్రమిది అన్నారు. వచ్చే నెల 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వంశీ, ప్రమోద్‌తో పాటు నటుడు మహేష్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events