ఇస్రో సైంటిస్టులకు, భారత ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయమని ప్రధాని కోనియాడారు. ప్రధాని మోదీ బ్రిక్స్ నుంచి మాట్లాడారు. నేను బ్రిక్స్‌లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్ మీదే ఉంది. చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా 1000 మంది ఇస్రో సిబ్బందికి నా అభినందనలు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశాం. ఇది ఎంతో అద్భుతమైన క్షణం. చంద్రయాన్ 3తో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. కళ్లముందు అద్భుతాన్ని చూశాము. నా జీవితం ధన్యమైసంది. అమృత కాలంలో తొలి ఘనవిజయం ఇది. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం అని అన్నారు.














