జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. అనన్య కథానాయికగా నటిస్తున్నది. అంజి దర్శకత్వం. తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయికుమార్ నిర్మిస్తున్నారు. హీరో రాకింగ్ రాకేష్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎంపీ సంతోష్‌కుమార్ క్లాప్‌నివ్వగా, ఏపీ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విఛాన్ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ రాకేష్ గొప్ప నటుడిగా, నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అన్నారు. రాకేష్ చక్కటి ప్రతిభావంతుడని, ఇండస్ట్రీలో అతని మంచి భవిష్యత్తు ఉందని తనికెళ్ల భరణి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం: కాసర్ల శ్యామ్, ఆర్ట్: బత్తుల మహేష్, కెమెరా, దర్శకత్వం: గరుడవేగ అంజి. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఫౌండర్ రాఘవ, విఎన్ ఆదిత్య, ప్రవీణ, అనిల్ కడియాల, ధనరాజ్, తాగుబోతు రమేష్, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు.














