Namaste NRI

మిలాన్‌లో గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ షూటింగ్ పూర్తి

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్రాలయం పతాకంపై వేణూ దోనేపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపికు జోడీగా బలగం నటి కావ్య కళ్యాణ్‌రామ్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇటలీలోని మిలాన్‌లో ఈ సినిమా తాలూకు కీలక షెడ్యూల్‌ పూర్తయింది. ఇందులో చిత్ర ప్రధాన తారాగణం మొత్తం పాల్గొన్నారు. మాస్‌, ఫ్యామిలీ అంశాలు కలబోసి తనదైన శైలిలో దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటలీలోని మిలాన్‌లోని సుందరమైన లొకేషన్స్‌లో ఓ పాటతో పాటు కీలకమైన టాకీ పార్ట్‌ చిత్రీకరించాం. ఈ సినిమాలో చాలా భాగం విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటుంది. గోపీచంద్‌ కెరీర్‌లోనే వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కెవీ గుహన్‌, సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, రచన-దర్శకత్వం: శ్రీను వైట్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events