ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలోని సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. వై.యస్.జగన్ పాత్రలో అజ్మల్ నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. రెండు నిమిషాల 20 సెకన్లు ఉన్న వ్యూహం ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపరంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో తనదైన మార్కుతో చూపించాడు వర్మ. ఇక ఈ ట్రైలర్‌లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై, జగన్ పై చెప్పిన డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి.

రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు దాని వెనక ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటాయి. అవన్నీ బయటి ప్రపంచానికి తెలియవు. అలాంటి విషయాలను ఈ సినిమాలో చూపించాను. నేను సేకరించిన సమాచారాన్ని ప్రేక్షకులకు నచ్చే సినిమాటిక్ ఫార్మాట్‌లో తెరకెక్కించాను అని చెప్పారు. జగన్ రాజకీయ జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనలను తీసుకొని ఈ సినిమా చేశామని నిర్మాత పేర్కొన్నారు. నవంబర్ 10న ఈ చిత్రం విడుదలకానుంది.














