హీరో సుమంత్ కొత్త సినిమాకు మహేంద్రగిరి వారాహి అనే పేరును ఖరారు చేశారు. మీనాక్షి కథానాయిక. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తు న్నారు. ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోశ్ దర్శకుడు. రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి సమక్షంలో ఈ సినిమా టైటిల్ని మేకర్స్ ప్రకటించారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం నేపథ్యంలో సాగే కథ ఇదని దర్శకుడు చెప్పారు. రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఆలయం విశాఖ శారదాపీఠం లోనే ఉన్నందుకు అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడకు వచ్చామని నిర్మాతలు చెప్పారు. ఈ ఏడాది జూన్లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే టాకీ పూర్తి చేసుకోనుందని ఈ సందర్భంగా వారు అన్నారు.














