Skip to main content

Namaste NRI

ఘనంగా మురళీ మోహన్‌ గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌

టాలీవుడ్ సీనియర్‌ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైద‌రాబాద్‌లోని శిల్పకళావేదికలో గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్ జ‌రిగాయి. డా. మురళీమోహన్‌ 50 ఇయర్స్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఎక్సలెన్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుక‌లు జ‌రుగ‌గా,  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  ప్రముఖ వైద్యులు గురవారెడ్డి, నర్సాపురం పార్లమెంట్‌ సభ్యులు రఘురామకృష్ణంరాజు, సుజనాచౌదరి, సినీప్రముఖులు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, కీరవాణి, సి.అశ్వనీదత్‌, కోట శ్రీనివాసరావు అతిథులుగా హాజరయ్యారు.  ఈ సంద‌ర్భంగా భారీ దండ‌తో మురళీమోహన్‌ను సత్కరించారు. ఇక మురళీ మోహన్ అభిమానులు పెద్దయెత్తున హాజరై ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ మురళీ మోహన్ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం ఒక రికార్డు అని, అది కొందరికే సాధ్యమవుతుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖుల పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News