Skip to main content

Namaste NRI

ఆయ్ నుంచి తొలి లిరికల్ సాంగ్ .. సూఫియానా

నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ఆయ్‌. అంజి కంచిపల్లి దర్శకుడు. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మెలోడీ ప్రధానంగా సాగే సూఫియానా అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను రామ్‌ మిర్యాల స్వరపరచడంతో పాటు సమీర భరద్వాజ్‌, రమ్యశ్రీతో కలిసి ఆలపించారు. శ్రీమణి సాహిత్యాన్నందించారు. గోదావరి అందాల నేపథ్యంలో చక్కటి సాహిత్యంతో కన్నుల పండువగా ఈ పాట సాగింది. ప్రేమికుల మదిలోని భావాలకు అద్దం పట్టే చక్కటి గీతమిదని, శ్రావ్యమైన బాణీతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. చిత్రీకరణ ఫూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సినిమా టోగ్రఫీ: సమీర్‌ కల్యాణి, సంగీతం: రామ్‌ మిర్యాల, సమర్పణ: అల్లు అరవింద్‌, దర్శకుడు: అంజి కంచిపల్లి.

Social Share Spread Message

Latest News