అల్లరి నరేశ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మల్లి అంకం దర్శకుడు. రాజీవ్ చిలక నిర్మాత. శుక్రవారం సినిమా విడుదల కానుంది. చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. హీరో అడివి శేష్ మాట్లాడుతూ నరేష్ గారితో నాకు చాలా గొప్ప అనుబంధం వుంది. నా ఫస్ట్ ఆడియో లాంచ్ కి నరేష్ గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ రోజు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి రావడం చాలా ఆనందంగా వుంది. నా మనసులో నరేష్ గారు అంటే ఇంట్లో మనిషి. ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటా రు. ఆయన్ని ఎప్పుడూ కలసి చాలా ఆత్మీయంగా వుంటుంది. అబ్బూరి రవి గారు నా కెరీర్ కి బ్యాక్ బోన్. కలసి ఏడు సినిమాలు చేశాం. రాజీవ్ గారు ఐకానిక్ యానిమేషన్ మూవీస్ పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారో అలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఫారియా ని ఫస్ట్ టైం కలిశాను. చాలా అమాయకంగా కనిపించారు. అదే ఇన్నోసెన్స్ కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తారు. మల్లికి నా బెస్ట్ విశేష్. మా అన్నయ్య టీంలో ఆయన పని చేశారు.మే3న అందరం థియేటర్స్ లో సినిమా చూద్దాం . హాయిగా నవ్వుకుందాం’ అన్నారు.
అల్లరి నరేశ్ మాట్లాడుతూ ఉన్నన్ని రోజులూ నాతో సినిమాలు తీసి, హిట్లు ఇచ్చీ, నన్ను సక్సెస్‌ఫుల్ హీరోని చేశారు నాన్న. ఇప్పుడు భౌతికంగా లేకపోయినా, ఆయన టైటిల్ ఇచ్చి నన్ను దీవిస్తున్నారు. ఇది బరువుగా, బాధ్యతగా భావిస్తున్నాను అన్నారు. దర్శకుడిగా మల్లికి ఇది తొలి సినిమానే అయినా, అద్భుతంగా తీశాడు. 32మంది కొత్త దర్శకులతో పనిచేశాను. 31మంది విడుదలకు ముందు టెన్షన్ పడ్డారు. ఒక్క మల్లి మాత్రం చాలా కూల్‌గా నవ్వుతూ ఉన్నాడు. రాజీవ్ లాంటి నిర్మాతలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, మరో పది సినిమాలు ఆయన నిర్మించి పదిమందికి పని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు. సినిమాకు పనిచేసిన అందరికీ అతిథిగా విచ్చేసిన హీరో అడివి శేషు శుభాకాంక్షలు అందించారు. ఇంకా చిత్ర యూనిట్‌తోపాటు అతిథులుగా విచ్చేసిన దేవకట్టా, విజయ్ బిన్నీ, బీవీఎస్ రవి కూడా మాట్లాడారు.




























