Skip to main content

Namaste NRI

తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో… వేగేశ్న ఫౌండేషన్‌ మధుర గీతాలు

అన్నమయ్య జయంతి వేడుకల్ని పురస్కరించుకొని తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో న్యూజెర్సీలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వేగేశ్న ఫౌండేషన్‌ గాయకుల మధు గీతాలు పేరిట మే 18న సాయంత్రం 6 గంటలకు ఈ ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎడిసన్‌లోని ఉడ్రోవిల్సన్‌ మిడిల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితమని పేర్కొన్నారు.

భారత్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మానసిక వైకల్యం, ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు వేగేశ్న ఫౌండేషన్‌ అండగా నిలుస్తోంది. ఈ కారణంగా ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు తగిన తోడ్పాటునందిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపడమే కాకుండా, సమాజంలో  అందరితో సమానంగా ఆ పిల్లలు గౌరవంగా జీవించేలా కౌన్సెలింగ్‌ వంటివి ఇస్తూ నిరంతరం సేవలందిస్తోంది. మహోన్నత ఆశయంతో పనిచేస్తోన్న వేగేశ్న ఫౌండేషన్‌కు ఛారిటీగా అన్నమయ్య జయంతి ఈ మధుర గీతాలు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈవెంట్‌కు వచ్చినవారికి విందు ఏర్పాట్లు చేసినట్లు  తెలిపారు.

Social Share Spread Message

Latest News