Skip to main content

Namaste NRI

కొనసాగుతున్న లోక్‌సభ ఓట్ల లెక్కింపు

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా 258 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా కూటమి 166 చోట్ల లీడ్‌లో ఉన్నది. మరో 17 సీట్లలో ఇతరులు ఆధిక్యంలో కొనాగుతున్నారు. వారణాసిలో ప్రధాని మోదీ లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇక వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ, అమేథీలో స్మృతి ఇరాని, రాజస్థాన్‌ కోటాలో స్పీకర్‌ ఓం బిర్లా, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌, మధ్యప్రదేశ్‌లోని గుణలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆధిక్యంలో ఉన్నారు.

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో నితిన్‌ గడ్కరీ, హమీర్‌పుర్‌లో అనురాగ్‌ ఠాకూర్‌, కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌, విదిశాలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కర్ణాటకలోని మాండ్యలో కుమారస్వామి, మహారాష్ట్రలోని బారామతిలో సుప్రియా సూలే ఆధిత్యంలో కొనసాగుతున్నారు.

Social Share Spread Message

Latest News