Skip to main content

Namaste NRI

రాష్ట్రంలో అరాచక పాలన : వినయ్ సన్నీ గౌడ్

రేవంత్ రెడ్డి ప్రభుత్వం 420 రోజులు పూర్తి చేసుకున్నప్పటికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు విభిన్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బ్రిస్బేన్, సిడ్నీ, మెల్బోర్న్, కాంబెర్ర, అడిలైడ్ లాంటి నగరాలల్లో ప్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా యూత్ వింగ్ కన్వీనర్ వినయ్ సన్నీ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అయ్యినప్పటికి ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విన్నీ తూముకుంట మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Social Share Spread Message

Latest News