
భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్, రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్‌పై మరో 25 శాతం టారీఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 6న ఈ ఎగ్జిటీవ్ ఆర్డర్‌పై 14329పై సంతకం చేసిన ట్రంప్, ఈ నెల 27 నుంచి 50 శాతం టారీఫ్‌లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. దీంతో తాజాగా 25 అదనపు సుంకాలపై అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసులు జారీ చేసింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కొత్త సుంకాలు ఆగస్టు 27 తెల్లవారుజాము 12.01 గంటల నుంచే అమల్లోకి వస్తాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ద్వారా హోమ్‌లాండ్ ఆఫ్ సెక్యూరిటీ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది.















