Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక ప్రకటన

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక ప్రకటన చేశారు. రష్యాకు వ్యతిరేకంగా రెండోదశ  ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. క్రెమ్లిన్‌ నుంచి చమురు కొనుగోలు  చేసే భారత్‌ సహా ఇతర దేశాలపై రెండో దశ ఆంక్షల ప్రభావం పడనున్నట్లు వెల్లడించారు.

ఉక్రెయిన్‌పై రష్యా నిన్న భీకర దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కీవ్‌లోని కీలకమైన ప్రభుత్వ సముదాయాన్ని మాస్కో దళాలు ధ్వంసం చేశాయి. ఈ దాడి తర్వాత ట్రంప్‌ నుంచి రెండో దశ ఆంక్షల ప్రకటన వెలువడింది. రష్యా దాడి నేపథ్యంలో వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు ట్రంప్‌కు పలు పశ్నలు సంధించారు. రష్యా లేదా చమురు కొనుగోలు చేసే దేశాలపై చర్యలు తీసుకుంటారా? అని అధ్యక్షుడిని ప్రశ్నించారు. దీనికి అవును, అందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ ట్రంప్‌ సమాధానమిచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events