Skip to main content

Namaste NRI

డెన్మార్క్‌ కీలక నిర్ణయం… 15 ఏండ్ల లోపు నిషేధం

పిల్లలు సోషల్‌ మీడియా వాడకంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్య దేశం డెన్మార్క్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏండ్ల లోపు పిల్లలు సోషల్‌ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తున్నది. దీని ప్రకారం, తల్లిదండ్రుల అనుమతితో 13 ఏండ్లు దాటిన పిల్లలు సోషల్‌ మీడియా వాడకానికి కొన్ని షరతులతో అనుమతి ఇస్తున్నట్టు తెలిసింది. ఆన్‌లైన్‌లో విపరీతమైన హింస, స్వీయ హానికి పురిగొల్పే ప్రమాదకర కంటెంట్‌కు పిల్లల్ని దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ డిజిటల్‌ అఫైర్స్‌ మంత్రి కరోలినా తెలిపారు.

Social Share Spread Message

Latest News