
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర విడుదలపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గతంలో గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మళ్లీ వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.















