ఉత్తర అమెరికా తెలుగు సంఘం(Telugu Association of North America, TANA) ఆధ్వర్యంలో గ్రామీణ విద్యార్థుల విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి పాఠశాలలకు తార్పాలిన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం PM SHRI ZP హై స్కూల్ PLUS, కొప్పాక లో జరిగింది.

ఈ కార్యక్రమానికి తానా న్యూజెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ నరేపలుపు ప్రాయోజకత్వం వహించగా, తానా కోశాధికారి రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు డా. నరెన్ కోడాలి మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కొప్పాక హై స్కూల్ పరిసర ప్రాంతాల్లోని 16 పాఠశాలలకు తార్పాలిన్లు అందజేశారు . గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాల సమావేశాలు, బహిరంగ తరగతులు మరియు ఇతర కార్యక్రమాల సమయంలో నేలపై కూర్చోవాల్సిన పరిస్థితులు ఉండటంతో, ఈ తార్పాలిన్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.


ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన పాఠశాలలు:
కొప్పాక, అంకన్నగూడెం, కొప్పాకగూడెం, సింగవరం, పెదకడిమి, అమ్మపాలెం, భోగాపురం, దుగ్గిరాల, పినకడిమి, వంగూరు, లక్ష్మీపురం, రామచంద్రపురం తదితర గ్రామాల ఉన్నత పాఠశాలలు మరియు ప్రాథమిక పాఠశాలలు.

ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కమిటీ చైర్మన్ కర్రి శ్రీరామ్, ప్రధానోపాధ్యాయులు మట్టా రామకృష్ణ, టీచర్ మరియు కార్యక్రమ సమన్వయకర్త శ్రీమతి సునీత, అలాగే కొప్పాక మరియు పరిసర ప్రాంతాల పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సేవా కార్యక్రమానికి ప్రాయోజకత్వం వహించిన సుధీర్ నరేపలుపుకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తానా నాయకత్వం ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తున్నందుకు తానా అధ్యక్షుడు డా. నరెన్ కోడాలి మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావులకు ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన కర్రి శ్రీరామ్, మట్టా రామకృష్ణ, సునీత మరియు ఇతర ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిసర పాఠశాలల ఉపాధ్యాయులు తానా సేవలను ప్రశంసిస్తూ, ఈ తార్పాలిన్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తానా నాయకత్వానికి, ప్రాయోజకుడు సుధీర్ నరేపలుపుకి, కార్యక్రమ నిర్వాహకుడు రాజా కసుకుర్తికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా తానా సంస్థ అమెరికాలో మాత్రమే కాకుండా భారతదేశంలో కూడా విద్య, రైతులు మరియు గ్రామీణ అభివృద్ధికి సేవలు అందిస్తూ ముందుకు సాగుతోంది.















