Namaste NRI

అమెరికాకు షాకిచ్చిన శ్రీలంక

ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికాకు శ్రీలంక షాకిచ్చింది. తమ దేశానికి చెందిన రెండు యుద్ధ విమానాల్ని ల్యాండ్ చేసేందుకు అంగీకరించాలంటూ అమెరికా చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తాము యుద్ధ సమయంలో తటస్థ వైఖరి అవలంభిస్తామని అమెరికాకు శ్రీలంక స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే అక్కడి పార్లమెంట్‌లో దీనిపై ప్రకటన చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు ఆఫ్రికాలోని డిబౌటి పట్టణంలో ఉన్నాయి.

ఈ విమానాలు ఒక్కో దాంట్లో ఎనిమిది యాంటీ షిప్ మిస్సైల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ వాటిని వ్యూహాత్మకంగా వాడేందుకు శ్రీలంకకు తీసుకురావాలనుకుంది. ఇందుకోసం ఆయుధాలతో కూడిన ఈ విమానాల్ని శ్రీలంకలోని మట్టాలా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేస్తామని, ఇందుకు అనుమతించాలని అమెరికా కోరింది. ఈ నెల ప్రారంభంలో ఈ అంశంపై శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకేతో అమెరికాకు చెందిన సౌత్, సెంట్రల్ ఆసియా ప్రతినిధి సెర్గియో గోర్ చర్చలు జరిపారు. ఈ నెల 4న శ్రీలంకలో విమానాల్ని ల్యాండ్ చేసేందుకు అనుమతించాలని కోరారు. కానీ, దీనికి అధ్యక్షుడు దిస్స నాయకే నో చెప్పారు. తాము ఈ యుద్ధ సమయంలో తటస్థంగానే ఉండదలిచామని దిస్సనాయకే తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events