Namaste NRI

ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక కు హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు

టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చిన్న కుమార్తె వివాహ వేడుక గుంటూరు శ్రీ కన్వెన్షన్ లో జరిగింది.ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్ లను ఆశీర్వదించారు.వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్,
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events