
ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలకు సమయం ముంచుకొస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. ఇరాన్ వద్ద ఇక ఏ మార్గమూ మిగల్లేదని, కీలక అంతర్జాతీయ జలమార్గాలపై నియంత్రణ ద్వారా ప్రపంచాన్ని స్వల్పకాలికంగా దోచుకోవడంపై మాత్రమే ఇరాన్ ఆధారపడుతున్నదని విమర్శించారు. తమ వద్ద వేరే మార్గాలు లేవని ఇరానీయులు ఇంకా గ్రహించినట్లు లేరని ఆయన వ్యాఖ్యానించారు. వారు ఈ రోజు సజీవంగా ఉండడానికి ఏకైక కారణం చర్చలు జరపడమే అని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో శాంతి చర్చలు విఫలమైతే దాడులను పునరుద్ధరించడానికి శక్తివంతమైన ఆయుధాలతో అమెరికా యుద్ధ నౌకలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.















