
ఇరాన్‌తో సీజ్ఫైర్ ను పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన శాంతి చర్చలు రద్దు అయ్యాయి. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తన పాక్ పర్యటన రద్దు చేసుకున్నట్లు వైట్‌హౌజ్ ద్రువీకరించింది. ఈనెలలో రెండోసారి జేడీ వాన్స్ పాక్‌లో పర్యటించాల్సి ఉంది. ఇరానీ ప్రతినిధులతో ఓ డీల్ కుదుర్చుకునేందుకు ఆ ట్రిప్ జరగాల్సి ఉంది. కానీ కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో వాన్స్ జర్నీ నిలిపివేశారు. అయితే ఒకవేళ వ్యక్తిగత సమావేశాలు ఏమైనా ఉంటే దానిపై ప్రకటన చేస్తామని వైట్‌హౌజ్ అధికారులు చెప్పారు.















