Namaste NRI

భారతీయ పరిశోధకులకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

అమెరికాలో ముగ్గురు భారతీయ పరిశోధకులకు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. అమెరికా ఇంధన శాఖకు చెందిన సైన్స్, ఇంజినీరింగ్ ప్రయోగశాల ఆర్గోన్ నేషనల్ లేబోరేటరీ అందించే పోస్ట్ డాక్టోరల్ పెర్ఫామెన్స్ అవార్డును వీరు సొంతం చేసుకున్నారు. కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటింగ్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శిల్పిక, కిరణ్ కుమార్ యలమంచి ఈ ఏడాది పురస్కారానికి ఎంపికైన వారిలో ఉండగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి కృష్ణ తేజ చిట్టి వెంకట గతేడాది ఈ అవార్డును అందుకోవడం విశేషం.

ఉస్మానియా వర్సిటీలో ఇంజినీరింగ్ చేసిన కృష్ణ తేజ ఆ తర్వాత అమెరికా వెళ్లి అయోవా స్టేట్ యÖనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. అనంతరం ఆర్గోన్ ల్యాబ్ లో చేరిన ఆయన సూపర్ కంప్యూటర్లపై ఏఐ వ్యవస్థలను మరింత సమర్థంగా పనిచేసేలా చేయడంపై దృష్టి సారించారు. ఎలఎలఎం ఇన్ఫరెన్స్ బెంచ్ పేరుతో ఓపెన్ సోర్స్ టెస్టింగ్ టూల్‌ను రూపొందించారు. మరో ఇండో అమెరికన్ ళిల్పిక ఎక్సఏఐలో నిపుణురాలు. సూపర్ కంప్యూటర్‌లను శాస్త్రవేత్తలకు మరింత చేరువ చేయడంలో పరిశోధనలు చేస్తున్నారు. ఐఐటీ మద్రాస్‌లో చదువుకున్న కిరణ్ కుమార్ ఆర్గోన్‌లో అసిసోయేట్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. భౌతిక శాస్త్రాన్ని మెషిన్ లెర్నింగ్‌తో అనుసంధానించే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events