Skip to main content

Namaste NRI

ఇప్పటివరకు భారతీయ సినిమాలో రానటువంటి కాన్సెప్ట్‌ ఇది : జోశర్మ

జోశర్మ ప్రధాన పాత్రలో మోహన్‌ వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఎమ్‌4ఎమ్‌ (మూటివ్‌ ఫర్‌ మర్డర్‌) చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా కథానాయిక జోశర్మ విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకుంది. తాను అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి వచ్చానని, తెలుగులో తనకిది తొలి చిత్రమని, ఇందులో రాధ అనే క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తానని చెప్పింది. ఈ సినిమా విడుదలకు ముందే లాస్‌ఏంజిల్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, లండన్‌ ఫిలిం ఫెస్టివల్‌ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 15 అవార్డులను గెలుచుకుందని తెలిపింది. ఇదొక మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌. ఓ సీరియల్‌ కిల్లర్‌, హత్యలు చేసిన తర్వాత మృతదేహాలను కళాఖండాల తరహాలో డెకరేట్‌ చేస్తుంటాడు. అతన్ని పట్టుకునే క్రమంలో జరిగే సంఘటనలు ఉత్కంఠను పంచుతాయి. ఇప్పటివరకు భారతీయ సినిమాలో రానటువంటి కాన్సెప్ట్‌ ఇది అని జోశర్మ వివరించింది.

Social Share Spread Message

Latest News