
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందనే బలమైన ఆశల నడుమ చర్చలు నిర్మాణాత్మకంగా, క్రమబద్ధంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. సమయం మనకు అనుకూలంగా ఉన్నందున ఒప్పందం విషయంలో తొందరపడవద్దని తన ప్రతినిధులకు సూచించినట్టు ఆయన తెలిపారు. ఒప్పందం కుదిరి, ధ్రువీకరించి, సంతకం చేసే వరకు ఇరాన్‌పై దిగ్బంధం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇరు పక్షాలు తగిన సమయం తీసుకుని దానిని సమర్థంగా చేయాలి. ఎలాంటి తప్పులు ఉండరాదు అని పేర్కొన్నారు. ఇరాన్‌తో వాషింగ్టన్ సంబంధాలు పూర్తి స్థాయి నిర్మాణాత్మకంగా మారబోతున్నాయన్నారు. వారు అణు ఆయుధం, అణు బాంబును అభివృద్ధి చేయలేరు అని తెలిపారు. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందాల్లో చేరాలని కోరారు.





























