ఎన్ఆర్ఐ టీడీపీ లాస్ ఏంజెల్స్ ఆధ్వర్యంలో మినీ మహానాడు – 2026 మరియు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. సుమారు 150 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రవాస తెలుగు ప్రజలు పాల్గొని ఎన్టీఆర్ గారి సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మహానాడు తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, అలాగే పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. నాయకులు మరియు కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాల పట్ల తమ అంకితభావాన్ని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, తెలుగు జాతికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకలు ప్రవాస తెలుగు సమాజంలో పార్టీ పట్ల ఉన్న ఆదరణను, ఐక్యతను మరోసారి చాటిచెప్పాయి.


వర్చువల్ గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
లాస్ ఏంజెల్స్ (యుఎస్ఎ): తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు.

లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టిడిపి నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట్టి, శ్రీధర్ సాతులూరి, వంశీ గరికపాటి, విష్ణు యలమంచి, ప్రతాప్ మెతరమిట్ట, సురేష్ అయినంపూడి, సురేష్ అంబటి, చందు గుత్తికొండ, శ్రీకాంత్ అత్తోటి, కిషోర్ గరికపాటి, వెంకట్ సుంకర, నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జూమ్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. వారి కృషివల్ల గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి భారీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును జులైలో ప్రధాని నరేంద్ర మోడీజీ చేతులమీదుగా ప్రారంభించబోతున్నాం. దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 7ఎయిర్ పోర్టులు రాబోతున్నాయి. విజయవాడ నుంచి సింగపూర్ కు ఇప్పటికే డైరక్ట్ సర్వీసులు ప్రారంభించాం, త్వరలోనే మలేషియా, హాంగ్ కాంగ్, గల్ఫ్ దేశాలకు కూడా నేరుగా సర్వీసులు ప్రారంభిస్తాం. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయంలో ఎన్ఆర్ఐ ల పాత్ర మరువలేనిది, మీ అందరి సహకారం, ఆశీర్వాదంతో 2029 ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తామని రామ్మోహన్ నాయుడు అన్నారు.


ఎన్ఆర్ఐలకు వారధిగా ఉంటా: కోమటి జయరాం
ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ… రాష్ట్రాభివృద్ధి కోసం సిఎం చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ చేస్తున్న కృషికి ప్రవాసాంధ్రుల సహకారం అవసరం. ఎపిలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న ఎన్ఆర్ఐలకు ఎటువంటి సాయం కావాల్సి వచ్చినా తాను వారధిగా ఉంటానని చెప్పారు. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ మాట్లాడుతూ మాట్లాడుతూ… గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఆర్ఐల సహకారంతో విజయ దుందుభి మోగించాం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీవంతు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ప్రముఖ విశ్లేషకుడు తెలుగుదేశం అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ ఐ లు సహకారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో లాస్ ఏంజిల్స్ లోని టిడిపి అభిమానులు వేణుగోపాల్ జెట్టి, మధు బోడపాటి, రంగరావు నన్నపునేని, యార్లగడ్డ శ్రీనివాస్, మనోహర్ మద్దినేని, రమేష్ మంగా, వై.అనిల్ కుమార్, అచ్చయ్య చౌదరి, రవి పిన్నింటి , శ్రీకాంతి రామినేని , శ్రీకాంతి ఆమినేని,భారతి పెద్ది, వీరా వెంకట్సుధీర్ కోనేరు, వేణు గర్నేని, శివనాగ, మనోహర, నేతాజీ గుర్రం, సతీష్ యలవర్తి, సందీప్ నాయుడు రతినా, రాజ్య రావూరి, వై.విజయ్, వెంకట వాసిరెడ్డి, రూపేష్ నారా, మురళీకృష్ణ, రాహుల్ పోతిన, వి.శ్రీనివాస్, మురళీ స్వర్ణ, పి.రవికుమార్, కె.చిన్న, సి.ఆంజనేయులు, వెంకటప్రసాద్ కె, రవి చుండు సురేష్ కోటపాటి, ఎస్.అనిల్ కుమార్, పి.వెంకట్, భారత్ పొట్లూరి, నందన్ పొట్లూరి, సురేష్ కందేపు , సుమంత్ వైదన, వెంకట్ కొలనుపాక , ప్రశాంత్ అల్లాని, వెంకట్ కోరిపెల్ల, చందు పల్లెబోయిన తదితరులు, పాల్గొన్నారు.






























