Skip to main content

Namaste NRI

శ్రీనివాసమంగాపురం నాకెంతో ప్రత్యేకం : ఘట్టమనేని జయకృష్ణ

ఘట్టమనేని జయకృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం శ్రీనివాసమంగాపురం. రషా తడానీ కథానాయిక. మోహన్‌బాబు కీలక పాత్రధారి. అజయ్‌భూపతి దర్శకుడు. వైజయంతీ మూవీస్‌ సి.అశ్వనీదత్‌, ఆనంది ఆర్ట్స్‌ జెమినీ కిరణ్‌ కలిసి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా హీరోహీరోయిన్ల పాత్రలైన శ్రీను, మంగాలను పరిచయం చేస్తూ ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్‌లో ఘట్టమనేని జయకృష్ణ మాట్లాడారు.తాతయ్య పుట్టినరోజు సందర్భంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. నా తొలి సినిమా శ్రీనివాసమంగాపురం నాకెంతో ప్రత్యేకం. ఇది ఛాలెంజ్‌తో కూడుకున్న పాత్ర. మంచి కథతో నన్ను పరిచయం చేస్తున్న డైరెక్టర్‌ అజయ్‌భూపతికి, సి.అశ్వనీదత్‌గారికి థాంక్స్‌. వెనకుండి ప్రోత్సహిస్తున్న మా బాబాయి మహేశ్‌బాబుకి ధన్యవాదాలు అని అన్నారు.

దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ్‌ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. సూపర్‌స్టార్‌కృష్ణ మనవడ్ని తెరకు పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నా. జయకృష్ణ హైలీ టాలెంటెడ్‌ యాక్టర్‌. అద్భుతంగా చేశారు.స్క్రిన్‌ ప్రజెన్స్‌ అదిరిపోయింది. రషా తడానీ కూడా వెరీగుడ్‌ యాక్ట్రస్‌. జీవీ ప్రకాశ్‌కుమార్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుంది. ఎక్కువగా అవుడ్డోర్‌లోనే ఈ చిత్రం తెరకెక్కించాం. ప్రేక్షకులకు కన్నుల పండువగా ఉంటుందీ సినిమా. చక్కటి ప్రేమకథగా ఆకట్టుకుంటుంది అని డైరెక్టర్‌ అజయ్‌భూపతి తెలిపారు.

Social Share Spread Message

Latest News