Namaste NRI

భారత్‌కు అమెరికా హెచ్చరిక

అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీషన్‌ గ్రీర్‌ ఈ వారంలో భారత్‌లో పర్యటిస్తున్న క్రమంలో ఆ దేశ ఖజానా కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ ప్రపంచ దేశాలకు తాజా హెచ్చరిక జారీ చేశారు. అదనపు సుంకాలు విధించరాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా 301 సెక్షన్‌ కింద ఆయా దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని ఆయన పేర్కొన్నారు. భారత్‌-అమెరికా మొదటి విడత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)ను ఖరారు చేసుకునేందుకు భారత వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో గ్రీర్‌ చర్చలు జరిపారు. వాణిజ్య ఒప్పంద ఖరారుకు అతి దగ్గరలో ఉన్నట్టు ప్రకటించారు.
అమెరికన్‌ కంపెనీలపై డిజిటల్‌ సేవల పన్ను విధించే ఏ దేశం నుంచైనా వచ్చే అన్ని వస్తువుల పైనా 100 శాతం సుంకాన్ని విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events