గచ్చిబౌలిలోని GMC బాలయోగి స్టేడియంలో జరిగిన రబీ రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లో హైదరాబాద్ హీరోస్ విజేతగా నిలిచింది. ఫైనల్లో హైదరాబాద్ 41-17 తో ముంబయి డ్రీమర్ ను చిత్తుచేసింది. విజేత హైదరాబాద్ జట్టుకు రూ. 45 లక్షలు, రన్నరప్ కి రూ. 25 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు బ్రేవ్ హార్ట్ జట్టుకు రూ. 15 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకున్నాయి.


హైదరాబాద్ హీరోస్ వర్సెస్ ముంబై డ్రీమర్స్ మధ్య జరిగిన RUGBY PREMIER LEAGUE ఫైనల్స్ కు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫైనల్స్ లో విజయం సాధించిన హైదరాబాద్ హీరోస్ టీమ్ కు ట్రోపీని బహూకరించి, అభినందించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి Rugby India President and actor రాహుల్ బోస్, GMR కార్పొరేట్ చైర్మన్ గ్రంథి కిరణ్ కుమార్, బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేనల్ YC, నటి మృనాల్ ఠాకూరు మరియు ముక్యమైన అతిథులు, ప్రముఖులు పాల్గొన్నారు.





























