Skip to main content

Namaste NRI

12 ఏండ్ల బాలుడు వరల్డ్‌ రికార్డ్‌

హర్యానా రాష్ట్రం జబ్బర్‌కి చెందిన కార్తికేయ అనే 12 ఏండ్ల బాలుడు యాప్‌ డెవలపర్‌గా మారాడు. అతి తక్కువ వయసులో ఈ ఫీట్‌ సాధించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. జజ్జర్‌లోని జవహర్‌ నవోదయ స్కూల్‌లో చదువుతున్న ఈ బుడ్డోడు యూట్యూబ్‌లో చూసి మూడు యాప్‌లను క్రియేట్‌ చేసినట్టు తెలిపారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ క్లాసుల కోసం అతని తండ్రి  స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చాడు. దీంతో ఫోన్‌తో ఆడుకుంటూనే దాని సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు మొదలెట్టాడు.   ఈ క్రమంలో తరుచుగా తలెత్తుతున్న కొన్ని ఇష్యూస్‌ని యూట్యూబ్‌లో చూసి పరిష్కరించేవాడు. ఇట్లా మొదలైన అతని ఇంట్రెస్ట్‌ కాస్త కోడిరడ్‌ వంటి వంటి అంశాలను నేర్చుకునేలా చేసింది. తొలుత కోడిరడ్‌ ప్రక్రియలో మొబైల్‌ ఫోన్‌ హ్యాంగ్‌ కావడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. యూట్యూబ్‌ సాయంతో మళ్లీ దాని సాఫ్ట్‌వేర్‌ సరిచేసి పనికొచ్చేలా చేశాడు.

                         తొలుత ఒక యాప్‌ డెవలప్‌ చేశాడు. ఆన్‌లైన్‌లో జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించిన లూసెంట్‌ జీకే మొదటిది కాగా, రెండవది కోడిరగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ను బోధించే రామ్‌ కార్తీక్‌ లెర్నింగ్‌ సెంటర్‌. ఇక మూడోది శ్రీ రామ కార్తీక్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అనే యాప్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ యాప్‌ల ద్వారా ఏకంగా 45 వేల మంది విద్యార్థులు ఉచిత శిక్షణ పొందుతున్నారు.

Social Share Spread Message

Latest News